ఒకప్పుడు ఉచిత ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించిన జియో.. ఇటీవల టారిఫ్ ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ధరల వడ్డనకు దిగింది. దీపావళి సందర్భంగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.491 రీఛార్జ్ ప్యాక్‌ను అందుబాటులో తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్యాక్‌తో 91రోజుల పాటు రోజుకు 1జీబీ చొప్పున 4జీ డేటాను పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లలో అత్యధిక కాలం పాటు డేటాను అందించే ప్లాన్ ఇది. సోమవారం వరకూ ఈ ప్లాన్ రూ.491కే అందించింది. కానీ నేటి నుంచి ధరను రూ.499కి పెంచింది. కనీసం వారం రోజులు కూడా కాకముందే ప్లాన్ ధరను పెంచడం గమనార్హం. పెంచింది స్వల్పమే అయినా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.గతేడాది జియో తన సేవలను ప్రారంభించినప్పుడు రూ.499 ప్లాన్‌పై రోజుకు 2జీబీ 4జీ డేటాను అందించేది. ఇక జియో ధనాధన్ ఆఫర్ ప్రకటించిప్పుడు మాత్రం రూ.509కి 2జీబీ డేటాను ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం రూ.491 ప్యాక్‌ను రూ.499గా మార్పు చేసినట్లు జియో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొనలేదు. కానీ, మై జియో యాప్‌లో కేవలం రూ.499 మాత్రమే అందుబాటులో ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
tariff charges definition
BESTSELLER NO. 1 Commercial Shipping Handbook Amazon Kindle Edition Brodie, Peter (Author) English (Publication Language) 362 Pag...

-
Mule Camelback Hydration BESTSELLER NO. 1 CamelBak Mini M.U.L.E. Kids' Hydration Backpack - 50 oz Lapis Blue/White Stripe ...
-
Residing Stingy: jewelries ring silver earings for womens stylish 05/01/2018 dulhan set below 500 If you want to get out of debt,...
No comments:
Post a Comment